చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమా దేశ్ పాండే పేర్కొన్నారు. సోమవారం హాసిన్పర్తి మండలం ఎర్రగట్టు లోని శివాని బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హనుమకొండ, వరంగల్ జిల్లా ల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు చైల్డ్ అబ్యూస్, పోక్సో, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల పై వారు అవగాహన కల్పించారు.