వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలను ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఇస్లావత్ కళ్యాణ్ శనివారం సందర్శంచారు. ఆయన మాట్లాడుతూ వర్షాలకు పాఠశాలలోని చెట్లు నేలకూలాయని, సోమవారం పాఠశాలలు ప్రారంభిస్తున్నారని, వాటిని తొలగించకపోవడం దారుణమన్నారు. మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు అభివృద్ధి పనులు జరగకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అభి, నితిన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.