హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం మంత్రులు కొండా సురేఖ, సితక్క లతో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై కలెక్టర్ల కార్యాచరణ, సమన్వయ సమావేశంను మంత్రి పొంగులేటి నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని మంత్రి పొంగులేటి అన్నారు.