వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ 56 డివిజన్ లో స్మార్ట్ సిటీ 2కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ అశ్విని తానిజి తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జవహర్ నగర్ నూతనంగా బ్రిడ్జి ప్రారంభించారు. 16 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపన చేశారు.