వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం సోమవారం పునః ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ పత్తి మిల్లులను నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో నేటి నుంచి సీసీఐ, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు ఆందోళన చేపట్టారు.