AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 850 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికక్కడ పంపులు నిలిపివేశారు. అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. వేతన బకాయిలు చెల్లించాలని 600 మంది కార్మికుల సమ్మెకు దిగారు. పది నెలల వేతనాలు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, నీటి సరఫరా కొలతల ఆధారంగా వేతన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.