కళ్లు తిరిగి కాలువలో పడిపోయిన వ్యాపారి.. మూడు రోజులుగా చెత్తలోనే (వీడియో)

55చూసినవారు
AP: ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయిన చిరు వ్యాపారి మూడు రోజుల పాటు అందులోనే ఉండిపోయిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగుచూసింది. తెనాలి మారిస్ పేటకు చెందిన సుభాని తోపుడు బండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి కాలువలో పడటంతో తలకు గాయమైంది. గాయంతో పైకి రాలేక సుభాని అక్కడి చెత్తపై మూడు రోజులు గడిపాడు. చివరికి పోలీసులు కాలువలోకి దిగి తాడు సాయంతో సుభానిని పైకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్