నా కొడుకు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు: సతీష్ తల్లి (వీడియో)

75చూసినవారు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి.. తాను చనిపోతున్నానంటూ సతీష్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సతీష్ తల్లి స్పందిస్తూ.. 'ఎన్ని అప్పులున్నా, ఏ రోజూ బాధగా ఉండేవాడు కాదు. నా కొడుకు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు' అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు సోదరుడు భార్గవ్, స్నేహితులు పేరుపాలెం బీచ్‌లో సతీష్ జాడ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్