ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు: తలసాని

53చూసినవారు
ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు: తలసాని
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేయదలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉన్నత పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్