పోస్టాఫీస్‌లో రోజుకు రూ.333 పెట్టుబడితో రూ.17 లక్షల వరకు రాబడి పొందవచ్చు. అదెలాగంటే రోజుకు రూ.333 అంటే నెలకు రూ.10 వేలు అవుతుంది. ఇలా సంవత్సరానికి రూ.1.20 లక్షలు పొదుపుచేసుకోగలరు. అదే ఐదేళ్లకు రూ.6 లక్షలు కాగా ఈ స్కీంలో ప్రస్తుతం 6.7 శాతం ఇస్తుండగా వడ్డీతో రూ.7,13,659 రిటర్న్స్ వస్తాయి. అదే పదేళ్లు పెడితే అసలు రూ.12 లక్షలు కాగా వడ్డీ రూ.5 లక్షలు కలిపి రూ.17 లక్షలు మీ చేతికి వస్తాయి.