సీఎం రేవంత్ ఆదేశాల మేరకే కేసీఆర్‌ను ఆహ్వానించాం: వేణుగోపాల్

51చూసినవారు
సీఎం రేవంత్ ఆదేశాల మేరకే కేసీఆర్‌ను ఆహ్వానించాం: వేణుగోపాల్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ దశాబ్ధి వేడుకలకు ఆహ్వానించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ బృందం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే తెలంగాణ దశాబ్ధి వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని హర్కర వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.