తెలంగాణలో డబుల్‌ డిజిట్ సీట్లు సాధిస్తాం: కిషన్ రెడ్డి

73చూసినవారు
తెలంగాణలో డబుల్‌ డిజిట్ సీట్లు సాధిస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో డబుల్‌ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నది అసత్య ప్రచారం. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోంది. మేం తెలంగాణకు ఏమిచ్చామో చర్చకు సిద్ధం. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు ఇస్తాం. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తుకు మేం సిద్ధం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్