వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: హరీశ్ రావు

177చూసినవారు
వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: హరీశ్ రావు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరుగుతుందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయట్లేదని విమర్శించారు. కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడొద్దని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్