రెండు రోజుల్లో పెళ్లి.. 1.33 కిలోల బంగారు ఆభరణాలు చోరీ

82చూసినవారు
రెండు రోజుల్లో పెళ్లి.. 1.33 కిలోల బంగారు ఆభరణాలు చోరీ
మరో రెండు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగా.. శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో భారీగా బంగారం, నగదు చోరీకి గురైంది. ఈ సంఘటన హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 17న ఆదివారం పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ, మెహందీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో 1.33 కిలోల బంగారు ఆభరణాలు, 800 గ్రాముల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్