AP: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానుండడంతో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్లో మహిళలకు ఇస్తామన్న పథకాల అమలుపైనే ఫోకస్ పెట్టనుంది. మహిళలకు రూ.1500, రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాల మంజూరుపై చర్చించనున్నారు.