కెనడా నుంచి భారత్ ఏం కొనుగోలు చేస్తుంది, ఏం విక్రయిస్తుంది?

61చూసినవారు
కెనడా నుంచి భారత్ ఏం కొనుగోలు చేస్తుంది, ఏం విక్రయిస్తుంది?
భారతదేశం మందులు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్ వస్త్రాలు, సేంద్రీయ రసాయనాలు, ఇనుము, ఉక్కు, ఆభరణాలు, రత్నాలతో పాటు కొన్ని ఇంజనీరింగ్ పరికరాలను కెనడాకు ఎగుమతి చేస్తుంది. అలాగే భారత్ ప్రధానంగా కెనడా నుంచి పప్పులు, ఐరన్ స్క్రాప్, ఖనిజాలు, కలప, కాగితం, పొటాష్, పారిశ్రామిక రసాయనాలు వంటి వాటిని దిగుమతి చేసుకుంటుంది. కాగా కెనడా, భారత్ పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్న విషయం తెలిసిందే.