గుండె ఆగిన వెంటనే మెదడు మరణంతో పోరాడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె ఆగిపోయాక, ఫీల్ గుడ్ హార్మోన్ గా పిలిచే సెరటోనిన్ ఎలుకల్లో 60 రెట్లు, అప్రమత్తంగా ఉండేలా చేసే నోర్పైన్ ఫ్రైన్ 100 రెట్లు పెరిగినట్లు కనిపించింది. బతికుండగా ఈ స్థాయిలో హార్మోన్లు విడుదలవ్వవు. గతేడాది కోమాలో ఉన్న ఇద్దరి వెంటిలేటర్ను తొలగించినప్పుడు వాళ్ల మెదడులోనూ అత్యంత చురుకైన గామా తరంగాలను పరిశోధకులు గుర్తించారు.