కృత్రిమ వర్షం అంటే ఏమిటి?

72చూసినవారు
కృత్రిమ వర్షం అంటే ఏమిటి?
మేఘాలలో వర్షపు విత్తనాలను విత్తే ప్రక్రియను కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) అంటారు. సాధారణంగా ఘన కార్బన్‌డయాక్సైడ్‌ వంటి రసాయనాలను కృత్రిమ వర్షం కోసం వినియోగిస్తుంటారు. ఇవి అదనపు మంచు కేంద్రకాలుగా పనిచేస్తాయి. నీటి ఆవిరితో కూడిన బిందువులు దట్టంగా గూడుకట్టేలా చేస్తాయి. బిందువులు పెద్దగా అయ్యేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అవి మరీ పెద్దగా అయ్యి, చివరికి వాన చినుకుల్లా కురుస్తాయి.