సాధారణంగా సూర్య కిరణాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అయితే ఎండలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. UV కిరణాల ఎఫెక్ట్ తో చర్మం ఎర్రబడుతుంది. నల్ల మచ్చలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు స్కిన్ క్యాన్సర్ కూడా కలుగుతుంది. అయితే ఈ ప్రభావం తీవ్రతరమైతే వడదెబ్బకు మించిన పరిస్థితులు తలెత్తుతాయి. దీన్నే సన్ పాయిజనింగ్ లేదా ఫోటోడెర్మాటిటిస్ అంటారు. ఈ వ్యాధితో ఏటా 60వేల మరణాలు సంభవిస్తున్నాయి.