NPS వాత్సల్సలో ఏడాదికి రూ.10 వేలు చొప్పున 18ఏళ్ల పాటు మదుపు చేస్తే.. 18వ ఏడాదికి 10% రాబడి అంచనాతో రూ.5 లక్షలు సమకూరుతుంది. అదే 60 ఏళ్లు వచ్చేసరికి (పదవీ విరమణ వయసు) 10% రాబడి అంచనాతో రూ.2.75 కోట్లు, 11.59% రాబడి అంచనాతో రూ.5.97 కోట్లు, 12.86% ప్రతిఫలం వస్తుందీ అనుకుంటే రూ.11.05 కోట్లు పొందొచ్చు. గత డేటా ఆధారంగా రాబడిని అంచనా వేశామని, వాస్తవ ప్రతిఫలంలో మార్పులుండొచ్చని పీఐబీ పేర్కొంది.