దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ.. శాశ్వత పరిష్కారం విషయంలో ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది. వరదలు వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడేకంటే.. ముందుగానే శాశ్వత పరిష్కారం కనుగొంటే ముప్పుల నుంచి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.