'మేడే' ఎప్పుడు మొదలైంది.. దాని చరిత్ర ఇదే

79చూసినవారు
'మేడే' ఎప్పుడు మొదలైంది.. దాని చరిత్ర ఇదే
కార్మికుల కష్టాన్ని గుర్తిస్తూ ఏటా మే1న మేడే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)గా నిర్వహిస్తున్నారు. 1886లో యూఎస్ లో రెండు లక్షల మంది కార్మికులు రోజుకు 8గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ఆ సమయంలో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత 1889లో మే1న కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఓ సమావేశంలో నిర్ణయించారు. 1890 నుంచి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.