స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలోని బ్యాంకులు, విద్యాసంస్థలు మూసివేస్తారు. ఈ రోజు జాతీయ సెలవుదినం. దేశవ్యాప్తంగా డ్రై డే అయినందున అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు పనిచేయవు. కాగా, ప్రజా రవాణా, పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులు, మాల్స్, రెస్టారెంట్లు వంటి అత్యవసర సేవలు తెరిచి ఉంటాయి.