ఉత్తరప్రదేశ్‌లోని ధన్ఘటా ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ మంచి మనసును చాటుకున్నారు. తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌కు జీవితంలో మర్చిపోలేని బహుమతి అందించారు. డ్రైవర్ విపిన్ మౌర్య పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే పెళ్లి ఊరేగింపు నిర్వహించడానికి తన కారును ఇవ్వడమే కాకుండా ఆయనే స్వయంగా దానిని నడిపారు. కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.