గాజా ప్రస్తుత పరిస్థితులపై WHO చీఫ్ భావోద్వేగం

72చూసినవారు
గాజా ప్రస్తుత పరిస్థితులపై WHO చీఫ్ భావోద్వేగం
గాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ భావోద్వేగం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ పాలక మండలి సమావేశంలో టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.