వానకాలంలో పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదాలు

69చూసినవారు
వానకాలంలో పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదాలు
వర్షాలు, ఈదురు గాలులకు ఎక్కువగా విద్యుత్‌ తీగలు పడిపోతుంటాయి. విద్యుత్‌ సరఫరా అవుతున్న విషయం తెలియక తీగలను, స్తంభాలను పట్టుకొని మూగ జీవాలతో పాటు ప్రజలూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో కిందికి వేలాడుతున్న తీగలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్