జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌పై ‘2018’ హీరో టొవినో థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉంటాయని చెప్పారు. తమ చిత్ర పరిశ్రమ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే తనకెంతో బాధగా ఉందని అన్నారు. ‘‘కమిటీతో నేను మాట్లాడాను. మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇదేవిధమైన కమిటీని ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో ఏర్పాటుచేసినా ఈ సమస్య ప్రతిచోటా ఉందనే విషయం మనకు తెలిసేది’’ అని టొవినో థామస్ పేర్కొన్నారు.