తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తా: సమంత

61చూసినవారు
తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తా: సమంత
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ సమంత ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తానని ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చారు. ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, పార్వతి తిరువోతు, అనన్య పాండే, దివ్యప్రభలను ఆమె రాక్‌స్టార్లుగా అభివర్ణించారు. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండేందుకు తాను మెడిటేషన్ చేస్తానని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్