ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిరుద్యోగులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాను' అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.