కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాలంతో పాటు ‘చాలా పరిణతి చెందారని’ నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ తనను జాతీయ నాయకుడిగా నిలబెట్టడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా మార్చిందన్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా పరిణతి చెందిన వ్యక్తి అని, గత కొద్దికాలంగా రాహుల్ లో చాలా మార్పు కనిపిస్తుందని తెలిపారు. భారతదేశం తదుపరి ప్రధానమంత్రి అయ్యో అవకాశం ఆయనకు ఉందని పేర్కొన్నారు.