గాలి వాన బీభత్సం.. విరిగిపడ్డ తాటిచెట్టు (వీడియో)

146043చూసినవారు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలుల వల్ల మండలంలోని నంచర్ల గ్రామంలో తాటి చెట్టు మధ్యలోకి విరిగిపోయింది. విరిగిన తాటి చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో స్తంభం కూడా విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈదురు గాలులకు తాడి చెట్టు విరిగిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.