అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఎలక్ట్రిక్ వైర్‌లపై విన్యాసాలు చేసింది. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫోజులిచ్చింది. ఆమెను గమనించిన వారు వెంటనే ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేశారు. వారు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ అమ్మాయిని బలవంతంగా కిందకు దించారు. ఈ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.