AP: కాకినాడ పోర్టులో ఉన్న షిప్‌లోకి బియ్యం ఎలా వచ్చిందనే విషయాన్ని త్వరలో తెలుసుకుంటామని ఆ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదాం నుంచి షిప్ వరకూ రేషన్ బియ్యం ఎలా అక్రమ రవాణా అయిందో తెలుసుకుంటామన్నారు. ఇందులోని బియ్యం మొత్తం పేదల బియ్యమేనా అనే కోణంలోనూ విచారణ జరుపుతామన్నారు. ఐదుగురు సభ్యుల బృందంతో అన్ని విషయాలపై ఆరా తీస్తామని స్పష్టం చేశారు.