భారత్‌పై కెనడా ప్రభుత్వ రంగ మీడియా మరోసారి బురద జల్లే ప్రయత్నాలు చేసింది. 2022లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో భారత్ జోక్యం అంటూ కథనాలను వెలువడ్డాయి. ఈ మేరకు కెనడా ప్రభుత్వ మీడియా సీబీసీ న్యూస్ సంచలన కథనం విడుదల చేసింది. అప్పట్లో కన్జర్వేటివ్ పాట్రిక్ బ్రౌన్ అభ్యర్థిత్వాన్ని తప్పించేందుకు భారత ఏజెంట్లు యత్నించారని కథనంలో పేర్కొంది.