కడపలో చిరుత పులి సంచారం (వీడియో)

78చూసినవారు
AP: వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. తాతిరెడ్డి పల్లి గ్రామంలోని పంట చేనులో పులి తన రెండు పిల్లలతో కనిపించింది. అది చూసిన మేకల కాపరులు తమ ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. పులి బహిరంగంగా సంచరిస్తూ ఉండటంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మరో వైపు గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్