గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ (వీడియో)

57చూసినవారు
TG: కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని కంట తడి పెట్టుకుంది. ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరులేదని, తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాళ్లు పట్టుకుంది. ఈ వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది. కాగా, లంచాలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు కేటాయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు