బెంగళూరు నగరంలో దారుణ ఘటన జరిగింది. కేటరింగ్ సర్వ్ చేసే ఓ మహిళను గురువారం రాత్రి నలుగురు యువకులు ఫాలో అయ్యారు. తాము ఉండే హోటల్‌కు భోజనం తీసుకు రావాలని ఆమెను వారు కోరారు. భోజనం తెచ్చిన ఆ మహిళను హోటల్ టెర్రస్ పైకి వారు లాక్కెళ్లారు. అక్కడ యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. శుక్రవారం ఉదయం వదిలేశారు. బాధితురాలు ఈ విషయాన్ని తొలుత భర్తకు, తర్వాత పోలీసులకు తెలిపింది. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.