TG: యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు కూడా రావాల్సిందిగా ఆలయ పూజారులు, అధికారులు కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. అలాగే యాదగిరిగుట్ట స్వర్ణవిమాన గోపుర మహాకుంభాభిషేకం కార్యక్రమానికి కూడా రావాలని ఆహ్వానించారు. శుక్రవారం ఈవో, ఆలయ పూజారులు వెళ్లి కేసీఆర్‌ను కలిసి ఆహ్వానం పలికారు. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.