లోక్‌సభ పోరులో మహిళా అభ్యర్థులు 10% లోపే

81చూసినవారు
లోక్‌సభ పోరులో మహిళా అభ్యర్థులు 10% లోపే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో కలిపి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో మహిళల వాటా 10 శాతం కంటే లోపే ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ADR) తెలిపింది. లోక్‌సభకు మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ADR విశ్లేషించగా.. వారిలో 797 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దాదాపు 9.5 శాతానికి సమానం.