వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు

83చూసినవారు
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత పనితీరు కనబర్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.41 లక్షల కోట్లకు పెరగడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది. 2013-14లో హైదరాబాద్‌లో 3.23 లక్షల మంద ఐటీ రంగంలో పని చేయగా.. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 9 లక్షలు దాటడం గమనార్హం. వరుసగా నాలుగుసార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఆయనది.