ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ..త్వరలో

76చూసినవారు
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ..త్వరలో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వేవంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వేబ్రిడ్జి మీదుగా రాంబన్-రియాసీకి అతిత్వరలో రైతు సర్వీసులు ప్రారంభంకానున్నట్లు ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వేవంతెన పొడవు 1,315 మీటర్లు.

ట్యాగ్స్ :