శరీరానికి కావల్సిన పోషకాల్లో జింక్ కూడా ఒకటి. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జింక్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. జీర్ణశక్తి కూడా తగ్గతుంది. తరచూ జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారంటే జింక్ లోపం ఉందని తెలుసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. జింక్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, సీ ఫుడ్, ఓట్స్, పెరుగు వంటివి తీసుకోవాలి.