ధాన్యం కొనగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

2651చూసినవారు
ధాన్యం కొనగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
ఆలేరు మండల కేంద్రంలోని ఆలేరు మార్కెట్ కమిటి, కొలనుపాకలోని వరి ధాన్యం కొనగోలు కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం పరిశీలించారు. భాస్కర్ రావు రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాలని రైతులకి సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్