భారత మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరోనా బారిన పడి బాధపడుతున్న నిరు పేద కుటుంబాలకు పౌష్టికాహారం, నిత్యావసరాలను ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈసందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో కరోనాతో పేద ప్రజలు బాధ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ పదవులను అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు గాని ముందుకు వచ్చి కరోనా బాధితులను ఆదుకోకపోవడంతో నేనున్నానంటూ గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశా కిరణం కల్లూరి రాంచంద్రారెడ్డి మాత్రమేనని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గడ్డమీది యాదగిరి, మడిగే వెంకట స్వామి, కోట సురేష్ , బండారి శ్రీను, శ్రీకాంత్ నాయక్, వెంకటేష్ నాయక్ , రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.