భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నుల పంపిణీ చేయడమైనది. గ్రామానికి చెందిన దొంతిరి శ్రీధర్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్దం స్టడీ మెటీరియల్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడెపు విజయ స్వామి, ఉప సర్పంచ్ కొమ్మగాని ప్రభాకర్ గౌడ్, ఎస్ఎంసి చైర్మన్ ఆడెపు అనిత శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, ఫౌండేషన్ సభ్యులు జొర్క ఎల్లెష్, ఏకు శ్రీనివాస్ రెడ్డి, పైళ్ళ వెంకట్ రెడ్డి, గణేష్, మంత్రి శీశైలం, బచ్చె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.