ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా రెండో దఫానియమితులయ్యారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆమెకు కెటాయించిన చాంబర్ లో ప్రభుత్వం విప్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహ్మద్ అలీ, ఆలేరు నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్పంచులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.