యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో యాదాద్రి భువనగిరి డిసిసి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తండ్రి మృతి చెందారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వారి నివాసానికి చేరుకొని వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ సంజీవరెడ్డి తండ్రి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.