మోటకొండూర్ మండల పరిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బిజెపి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానంగా రైతులకు అందిస్తున్న వివిధ రకాల అభివృద్ధి పథకాలను ముఖ్యంగా ఎరువులపై రాయితీ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం పేదవారికి కరోనా కష్టకాలంలో ఉచితంగా 5 కేజీల బియ్యం ఫసల్ బీమా పథకం మొదలగు ఎన్నో పథకాల గురించి ప్రచురించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. మోటకొండూర్ బిజెపి మండల శాఖ అధ్యక్షులు జోరుక ఎల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పీసరి తిరుమలరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిర్ర రవీందర్, ఎస్సి మోర్చాజిల్లా ఉపాద్యక్షులు బైరపాక స్వామి, కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు అనంతుల పాండురంగారెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం కుమార్ , మండల నాయకులు బొడ్డు వీర మల్లేష్ , గడ్డం రమేష్, నల్లమాస విశ్వనాధం గౌడ్, సీస మల్లేష్ తధితరులు పాల్గొన్నారు.