బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో బీజేపీలో సభ్యత్వ నమోద కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీగా సభ్యత్వ నమోదు జరుగుతుందని బూత్ అధ్యక్షులు బర్మా గణేష్, మంద శ్రీశైలం, కురిమిండ్ల భాస్కర్ గౌడ్ తెలిపారు.