విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు అందజేత
బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాదాపు 200 ఉచిత బస్ పాసులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోపాల్ పూర్, నాగాయపల్లి, బోయిన్ పల్లి గ్రామాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి వస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఉచిత బస్ పాస్ లను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.